![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -282 లో... రెండు సీరియల్ ల సంగమం జరిగింది. "నువ్వు నేను ప్రేమ" మరియు "బ్రహ్మముడి" రెండు సీరియల్స్ ని కలుపుతూ ఒకే ఎపిసోడ్ గా మలిచారు మేకర్స్. ఈ రెండు సీరియల్స్ లలో హిందు సంప్రదాయం యొక్క గొప్పతనం వివరిస్తూ గ్రాంఢ్ గా కథనం సాగింది.
నువ్వు నేను ప్రేమ సీరియల్ లో పద్మావతి, విక్రమాదిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరు కొన్ని అనుకోని పరిస్థితులలో పెళ్ళి చేసుకున్నారు. అయితే పద్మావతికి మాత్రం విక్రమాదిత్య అంటే ప్రేమ. కానీ విక్రమాదిత్య కాస్త చిన్నచూపు.. చదువుకోలేదనే చులకనభావం దాంతో ఏమీ తెలియదని అమాయకురాలని భావిస్తూ తనని ఎప్పుడు తక్కువగా చూస్తుంటాడు విక్రమాదిత్య అలియాస్ విక్కి. అయితే విక్కీ స్థాపించన కంపెనీలో పద్మావతిని సీఈవోగా అపాయింట్ చేస్తాడు. ఇక ఫారెన్ నుండి ఒక పెద్ద ప్రాజెక్టు వీరి కంపెనీకి వస్తుంది. అదే సమయంలో పద్మావతి, విక్కీలని వొడగొట్టాలని విలన్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు. దాంతో పద్మావతి, విక్కీలు చేసిన ప్రాజెక్టు కోసం ఎంపిక చేసుకున్న మాడల్స్ ని విలన్ కిడ్నాప్ చేసి బంధిస్తాడు. అదే సమయంలో ఫారెన్ డెలిగేట్స్ ప్రాజెక్టు ప్రెజెంటేషన్ చూడటం కోసం వస్తారు. ఇక తను ఎన్నో నెలలుగా కష్టపడుతున్న ప్రాజెక్టు ఆగిపోతుందని పద్మావతిని విక్కీ తిడుతుంటాడు. అదే సమయంలో పద్మావతి ఒక తెలివైన నిర్ణయం తీసుకుంటుంది. మాడల్స్ లాగా పద్మావతి, విక్కీలు ఉండేలా చేసి ప్రాజెక్టు ప్రెజెంట్ చేయగా.. అది చూసిన ఫారెన్ డెలిగేట్స్ ఇంప్రెస్ అవుతారు. ఇక విలన్ కి ఈ నిజం తెలిసి నిరాశ చెందుతాడు. మరో ప్లాన్ తో పద్మావతి, విక్కీలని దూరం చేస్తా అని శపథం చేస్తాడు.
.webp)
బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ ఫోన్ లో శ్వేతతో మాట్లాడటం అపర్ణ చూస్తింది. ఇక రాజ్ ఆ రోజు కౌగిలించుకొని ఉన్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడేమోనని అనుమానంతో రాజ్ ని నిలదీస్తుంది. అయితే సూటిగా అడుగకుండా.. కావ్యతో నిజంగానే ప్రేమగా ఉంటున్నావా? నటిస్తున్నావా? తనలో లేనిపోని ఆశలు పెంచకు అని అపర్ణ అంటుంది. అదేం లేదమ్మా.. తనకి నాకు సెట్ కాదు నేనేం ఆశలు పెంచట్లేదు త్వరలోనే తనని వదిలించుకుంటానని కాన్ఫిఢెంట్ గా అంటాడు రాజ్. ఇక అదే సమయంలో కళ్యాణ్ కి కావ్య కంకనం కడుతుంది. ఏంటి వదిన అని కళ్యాణ్ అనగానే.. నీ మీద చెడుదృష్టి ఉందని అది పోవడానికే ఈ కంకనం అని కావ్య అంటుంది. ఇక అనామిక, కళ్యాణ్ ల ప్రేమని గుర్తించి తనకి సపోర్ట్ చేస్తుందని కావ్య చెప్తుంటే దూరంగా ఉన్న కనకం ఆ మాటలు విని.. ఇన్ని రోజులు అడ్డుగా ఉంది కావ్య అని అనుకుంటుంది కనకం. అయితే ఆ రోజు పెళ్ళి ఆగిపోతుందని అందరు అన్నప్పుడు నా గుండె అయిపోయింత పని అయిందని కావ్యతో కళ్యాణ్ అనగానే కనకం ఎమోషనల్ అవుతుంది. నా కూతురు కోసం ఇంకో ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేయాలా అని కనకం అనుకొని ఇకనుండి కళ్యాణ్ అనామికల పెళ్ళికి అడ్డుపడకూడదని కనకం రియలైజ్ అవుతుంది. ఇక కళ్యాణ్ పెళ్ళి కోసం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కలిసి పసుపు దంచుతారు. ఇక మనతరుపు బంధువులని అందరిని పిలిచారా అని అనగానే.. మా తరుపు బంధువులని పిలిచాం మీ తరుపు బంధువులని పిలవు చిట్టి అని ఇందిరాదేవితో సీతారామయ్య అంటాడు. ఆ తర్వాత విక్రమాదిత్య కి రాజ్ ని కాల్ చేయమని ఇందిరాదేవీ చెప్తుంది. ఇక వీడియో కాల్ చేయు రాజ్ అందరం మాట్లాడతామని అపర్ణ అనగానే రాజ్ వీడియో కాల్ చేసి మాట్లడతాడు. ఇక కళ్యాణ్ పెళ్ళికి రమ్మని విక్రమాదిత్య-పద్మావతిలకి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కలిసి ఆహ్వానిస్తారు. ఆ తరువాయి భాగంలో.. విక్రమాదిత్య-పద్మావతిల ఫ్యామిలీ కలిసి కళ్యాణ్-అనామికల పెళ్ళికి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |